నెల రోజుల విరామం తర్వాత ‘గుంటూరు కారం’ చిత్రీకరణ మళ్లీ మొదలైంది. హైదరాబాద్
లోని ఓ స్టూడియోలో ప్రధాన తారాగణంపై గురువారం నుంచి కీలక సన్నివేశాల్ని
తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడు మహేశ్ బాబు మరో రెండు రోజుల్లో సెట్లోకి
అడుగు పెట్టనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో
శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని
క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్
నుంచి కొత్త ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస రంగంలోకి దిగారు. పి. ఎస్. వినోద్
తప్పుకోవడంతో మనోజ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. జనవరి 13న ఈ చిత్రాన్ని
విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా
షూటింగ్ మొదలైనప్పటి నుండి మార్పులు చేర్పులు జరిగాయి. ఈ సినిమా నుండి పూజా
హెగ్డే తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏన్ని మార్పులు చోటు చేసుకున్న
అనుకున్న సమయానికి ఈ సినిమాని విడుదల చేయడమే లక్ష్యంగా ఈ సినిమా చిత్రీకరణ
జరుపుతున్నట్లు సమాచారం.