తెలుగులో చాలా రోజులపాటు అగ్రస్థానంలోనే కనిపించిన పూజా హెగ్దే దాదాపు స్టార్
హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుని నటించింది. అయితే ఈమధ్యే ఆమె
కెరీర్ లో కొన్ని పరాజయాలు ఎదుర్కొంది .ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం
కావడం తదితర కారణాలతో పూజా హెగ్దే సందడి కనిపించడం లేదు. బాలీవుడ్ లో మాత్రం
తరచూ అవకాశాలు అందుకొంటూనే ఉంది ఈ భామ. తెలుగులో ఆమె అధికారికంగా ఒప్పుకున్న
సినిమా ‘గుంటూరు కారం’ మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు
తెలుస్తోంది. దాంతో ఆమె చేతిలో ప్రస్తుతానికి తెలుగు సినిమాలేవీ లేనట్టే. ఈ
పరిణామాలతో మరికొంత కాలం హిందీ కెరీరైపైనే దృష్టి పెట్టే ఆలోచనలో పూజ ఉన్నట్టు
సమాచారం. కొత్తగా కొన్ని హిందీ సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.