సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే సెకనులో వచ్చే గుండెపోటు మనిషి
ప్రాణాలను తీస్తుంది. అయితే గుండెపోటుకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
వీటిని గమనిస్తే ముందే జాగ్రత్త పడొచ్చు. మరి ఆ లక్షణాలేంటో తెలుసా?
*గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలు ఇతర వ్యాధులలాగానే ఉంటాయి. గుండెపోటుకు
ముందు ఛాతిలో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహరం సరిగ్గా
తీసుకోకపోవడం..ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వంటివి గుండెపోటుకు కారణాలుగా
చెప్పవచ్చు.
* చాలా మంది గ్యాస్ట్రిక్, అసిడిటీ వల్ల కడుపు నొప్పి వస్తుంది. అయితే కడుపు
మధ్య భాగంలోమంట, నొప్పి గుండెజబ్బులకు కారణం అవుతుంది.
*గుండెపోటు వచ్చే ముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఛాతిలో నొప్పిగా
ఉండడంతో పాటు చిన్న పనులకే నీరసంగా అనిపిస్తుంది.
*కొద్దిసేపు నడిచినా ఆయాసం వస్తుంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది.
*మంచి ఆహారం తీసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటే గుండె సంబంధిత సమస్యలకు చెక్
పెట్టొచ్చు. అలాగే ప్రతోరోజు వర్కౌట్, ధ్యానం, ప్రాణామాయం, యోగా వంటివి
చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.