సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నిత్యం
చురుకుగా ఉండాలి.
గుండెను ఆరోగ్యకరంగా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
అంతేకాకుండా సరైన పోషకాహారం తీసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహార
పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వాల్ నట్స్ :
వీటిలో విటమిన్ బి6, విటమిన్ ఇ లు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్,
కాపర్, సెలీనియం వంటి మూలకాలు సైతం ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో
పాత్ర వహిస్తాయి.
బాదం:
రెగ్యులర్ గా బాదం తినడంతో గుండె ఆరోగ్యంగా మారుతుంది. బాదంలో ఉండే పోషకాలు
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తాయి. బాదం తినడంతో రక్తపోటు స్థిరంగా
ఉంటుంది. గుండెపోటు వచ్చే సమస్య దూరం అవుతుంది.
జీడిపప్పు:
క్రమం తప్పకుండా జీడిపప్పు తినడంతో గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
జీడిపప్పులో మాంగనీస్, మెగ్నీషియం, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి
బీపీని కంట్రోల్లో ఉంచుతాయి.
పిస్తా:
పిస్తా పప్పులు గుండెను ఆరోగ్యంగా మార్చుతాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.
వీటిని తినడంతో రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. వీటిని తినడంతో
గుండె సమస్యలు దరిచేరవు.
వేరుశనగ:
వేరుశనగలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న విటమిన్లు,
మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిలను పెంచి గుండె
జబ్బులను నిరోధిస్తాయి.
హాజెల్నట్స్ :
హాజెల్ నట్స్ లో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పొటాషియం,
కాల్షియం, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండెను ఆరోగ్యంగా
మార్చుతాయి. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఎండు ద్రాక్ష:
ఎండు ద్రాక్షను తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె సమస్యలను దూరం
చేస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం కంటెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని
తినడంతో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.