గాంధీనగర్ : గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుదెరుగా వస్తున్న
కారు, బస్సు ఢీకొని తొమ్మిది మంది మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవ్‌సరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అంక్లేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం వల్సాద్ నుంచి తమ సొంతూరుకి
ఎస్‌యూవీలో బయల్దేరింది. మార్గమధ్యంలో నవ్‌సరి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా
ఎస్యూవీ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు డివైడర్‌ను
దాటుకుని అవతలివైపు ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ
ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్‌ను
ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద
తీవ్రతకు కారు నుజ్జు నుజ్జయ్యింది. ఘటన కారణంగా బస్సులో 28 మంది ప్రయాణికులు
గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
లగ్జరీ బస్సు సూరత్ నుంచి వల్సాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.అమిత్ షా దిగ్భ్రాంతి : ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విచారకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు
ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి స్థానిక యంత్రాంగం
తక్షణ చికిత్స అందించిందని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని
ప్రార్థించారు.