నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనున్న అహ్మదాబాద్ నగరంలో
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ‘పుష్పాంజలి యాత్ర’ నిర్వహించారు.
సుదీర్ఘమైన రోడ్‌షో సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని
సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.
ప్రధానమంత్రి వాహన శ్రేణి వెళుతుండగా, చాలా మంది ప్రజలు ఇరువైపులా బారులు
తీరారు. ఆయన వాహనశ్రేణికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. మోదీ, మోదీ, మోదీ
అంటూ పోస్టర్లు ఊపుతూ జనం ముందుకు వెళ్లారు. ప్రధాన మంత్రి చూపరులను
పలకరిస్తూ, చేతులు ఊపుతూ కనిపించారు.