గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మాజీ సీఎం భూపేంద్ర పటేల్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ
క్రమంలో ఆయన ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు
వెల్లడించాయి.
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ
శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను తమ నేతగా ఏకగ్రీవంగా
ఎన్నుకున్నారు. ఫలితంగా భూపేంద్ర పటేల్ వరుసగా రెండోసారి గుజరాత్
ముఖ్యమంత్రిగా ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర నేతృత్వంలో
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన భాజపా ఘన విజయాన్ని సొంతం
చేసుకుంది.మొత్తం 182 స్థానాలకుగాను 156 చోట్ల జయభేరి మోగించి వరుసగా ఏడోసారి
అధికారం చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా
విజయం సాధించడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు
భూపేంద్ర పటేల్ శుక్రవారం తన మొత్తం మంత్రివర్గంతో కలిసి ముఖ్యమంత్రి పదవికి
రాజీనామా చేశారు.తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే కొత్త శాసనసభా పక్ష
నేతను ఎంపిక చేసేందుకు గుజరాత్‌లోని పార్టీ కార్యాలయంలో భాజపా నేతలందరూ కలిసి
సమావేశమయ్యారు.పార్టీ కేంద్ర పరిశీలకులుగా భాజపా సీనియర్ నేతలు రాజ్‌నాథ్
సింగ్, బీఎస్ యడ్యూరప్ప, అర్జున్ ముండాలు సైతం ఈ సభకు హాజరయ్యారు.ఆ సభలో మాజీ
సీఎం భూపేంద్ర పటేల్‌ను మరోసారి సీఎం అభ్యర్థిగా నేతలందరూ ఏకగ్రీవంగా
ఎంచుకున్నారు.