బాలాయపల్లి (వెంకటగిరి ఎక్స్ ప్రెస్ ) :-
నాయుడుపేట వెంకటగిరి రోడ్డు మార్గం కాసరం కాసు రోడ్డు సమీపం వద్ద గుర్తు తెలియని వాహనం ఆదివారం డీ కొట్టడంతో బేల్దారి పనిచేస్తూ జీవ నం గడుపు తున్న పారిచర్ల ధన శేఖర్ (40)అక్క డక్కడ మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు తడ పట్టణం సునీత నగర్ చెంది న ధపశేఖర్ జీవనం సాగిస్తూండేవారు. వెంకటగి రిలో బేలుదారు పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఆదివారం వెంకటగిరి కి వచ్చాడు. రాత్రి తిరిగి వెళుతుండగా నాయుడుపేట వెంకటగిరి రోడ్డు మార్గం కాసరం సమీపం క్రాస్ రోడ్డు వద్ద మృతి చెంది రోడ్డుపై పడి ఉండడంతో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిందని ఎస్ఐ వీరనారాయణ కు సమాచారం రావడంతో వెంకటగిరి ఆస్పత్రికి తరలించి. అతను ఫోన్ లో ఉన్న నెంబర్ సహాయంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మృతదేహం అందజేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫోటో :- మృతి చెందిన ధనశేఖర్