ఏపీ ప్రభుత్వ పనితీరు భేష్ అని జాతీయ సర్వేలు చెబుతున్నాయి..
గత ప్రభుత్వం లాగా జగన్ మోసం చేయలేదు..
మౌలిక సదుపాయాల కల్పనకే వేల కోట్లు..
మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల్లో లక్షలాది ఇళ్ల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ
ఇన్ చార్జ్,మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మండలంలోని బూదగవి
గ్రామంలో గురువారం రెండవరోజు ఆయన’గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో
పాల్గొన్నారు.ముందుగా గ్రామస్తులు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి శ్రీమారెమ్మ
అవ్వ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం
జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఆయన
మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎన్నికల ముందు
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం
అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.రాష్ట్రంలో పేదలు ఇళ్ళు
నిర్మించుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందన్నారు.జగనన్న కాలనీలకు
సంబంధించి కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు
వెచ్చిస్తోందన్నారు. గత ప్రభుత్వం లాగా ప్రజలను మోసం చేయకుండా ఇసుక, సిమెంటు
అందిస్తూ బిల్లులను సకాలంలో అందిస్తూ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోందని
చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం లేకుండా మహిళా సంఘాల ద్వారా రుణాలు కూడా
ఇప్పిస్తున్నామన్నారు.రాష్ట్రంలో జరుగుతున్నది ఇళ్ల నిర్మాణాలు కాదని ఏకంగా
ఊళ్లే నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. జగన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం
పనితీరును దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థలు మెచ్చు కుంటున్నాయన్నారు. పథకాల
అమలుపై కేంద్ర నిపుణులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారని తెలిపారు. అట్టడుగు
స్థాయిలోనూ సీఎం వైయస్ జగన్ సంక్షేమ ముద్ర, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ
పనితీరు బాగుందని అన్ని రాష్ట్రాలు భేష్ అని అభినందనలు తెలియ
జేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బూదగవి గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి,
జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్
సుశీలమ్మ,కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, అమిద్యాల పిఏసీఎస్ చైర్మన్
తేజోనాథ్ తదితరులు పాల్గొన్నారు.