రామ్ చరణ్ కథానాయకుడిగా
తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’ దిల్ రాజు
నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్ ను
పూర్తి చేశారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చిత్రీకరణ తిరిగి
ప్రారంభించారు. అయితే ఈ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. రామ్ చరణ్ కియారా
పై బీచ్ సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా తీసిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో
వైరల్ అయ్యాయి. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు పాత్రల్లో
రామ్ చరణ్ కనిపించనున్నారు. శ్రీకాంత్, ఎస్. జే.సూర్య, అంజలి, సునీల్
కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రం చేస్తున్నారు.