తినడానికి ఎంతో రుచకరంగా ఉండే గోంగూర అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.పోషకాలు:
గోంగూరలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, బీ1, బీ2, బీ9తో
పాటు విటమిన్ సి కూడా లభిస్తుంది. గోంగూరలో పొటాషియం, ఐరన్ కంటెంట్ అధికంగా
ఉంటుంది.
ఎముకల సాంద్రత:
గోంగూరలో ఉండే విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ సీ దంతాలు, ఎముకలను దృఢంగా
మార్చుతాయి. ఇందులో ఉన్న కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతాయి. <
ఇన్సులిన్ స్థాయి:
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో గోంగూర సహాయపడుతుంది. క్రమం తప్పకుండా
గోంగూరను తినడంతో రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో చక్కెర
స్థాయిలు తగ్గుతాయి.
బీపీ:
గోంగూరలో పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ
వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రెగ్యులర్ గా గోంగూరను ఆహారంలో భాగం చేసుకోవడంతో
బీపీ కంట్రోల్లో ఉంటుంది.
వ్యాధి నిరోధకంగా.
గోంగూరలో ఉండే ఫోలిక్ యాసిడ్, ఇతర మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మాదిరి పని
చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వివిధ వ్యాధుల నుంచి
రక్షణను అందిస్తాయి.
శ్వాస వ్యవస్థ:
రెగ్యులర్ గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడంతో శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా
మారుతుంది. ముఖ్యంగా దగ్గు, ఆయాసం, తుమ్ముల సమస్య దూరం అవుతుంది.
కంటి చూపు:
గోంగూర ను ఆహారంలో భాగం చేసుకోవడంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి
సమస్యలు దూరం అవుతాయి. గోంగూర రసం తాగడంతో రేచీకటి తగ్గుతుంది.
విరేచనాలు:
చాలా మంది తరుచుగా విరేచనాల బారిన పడుతుంటారు. అటువంటి వారు గోంగూరను ఆహారంలో
భాగం చేసుకోవడంతో ఈ సమస్య దూరం అవుతుంది.