కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని
శ్రీపురం కాలనీలో గల గోనెసంచుల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా
అవి గోదాము మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా
స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.ఈ ప్రమాదంలో
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్య్కూట్ వల్లే
మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, గోదాములో 40 వేల గోనెసంచులు ఉన్నాయని,
ప్రమాదంలో అన్నీ కాలిపోయాయని యజమాని వాపోయారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం
జరిగిందని వెల్లడించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు
చేస్తున్నారు.