రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి
గోవర్ధన రెడ్డి
నెల్లూరు : పేద ప్రజలకు అండగా వుంటూ వారి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను
అమలు చేయడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు

గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం,
పొదలకూరు పంచాయతీ పరిధిలో ఆరో రోజు లింగంపల్లితోపులో గడపగడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కి
స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలుత 40 లక్షలతో నిర్మించిన సచివాలయ
నూతన భవనాన్ని, 17.5 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ నూతన
భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు
తెలుసుకుంటూ, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.
అనంతరం మంత్రి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత ఐదు రోజులుగా
పొదలకూరు మేజర్ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ
7.86 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం
జరిగిందన్నారు. ఈ రోజు 1.33 కోట్ల రూపాయలతో గ్రామ సచివాలయం, వైఎస్సార్
హెల్త్ క్లినిక్ నూతన భవన నిర్మాణాలను, సిమెంట్ రోడ్లను ప్రారంభించుకున్నట్లు
మంత్రి తెలిపారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు
వెచ్చిస్తుందని తెలిపారు. ఒకపక్క సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూనే, మరోపక్క
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులను మంజూరు చేస్తూ అభివృద్ది
కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజక వర్గ
పరిధిలోని అన్నీ గ్రామాలకు అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, విద్యుత్,
మంచినీరు వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపడుతున్నట్లు మంత్రి
తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల
పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ
కార్యక్రమంలో ఎంపిపి సుబ్బారాయుడు, జడ్పిటిసీ తెనాలి నిర్మలమ్మ, ఎంపీడీవో
నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, స్థానిక
నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు
పాల్గొన్నారు.