104 అంబులెన్స్ లను ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి
దేవరాపల్లి : గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు దిశగా ప్రభుత్వం కృషి
చేస్తోందని డిప్యూటీ సీయం ముత్యాలనాయుడు అన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలకు
వైఎస్సార్ హయంలో ఉన్న వైభవం తిరిగి తీసుకుని వచ్చే దిశగా సేవలు అందించడమే
లక్ష్యమని, గత ప్రభుత్వం విస్మరించిన వైద్య సేవలను వైసిపి ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గతం
కన్నా ఎక్కువ అంబులెన్స్ లను ఏర్పాటు చేశామనని, గ్రామీణ ప్రాంతాలలో నిర్దిష్ట
సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు
అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి అన్నారు. మండలం లోని తారువ గ్రామం క్యాంప్
కార్యాలయంలో పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాడుగుల, కోటపాడు,
దేవరాపల్లి మండలాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన అంబులెన్స్ లను
జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపిపి కీలపర్తి
భాస్కరరావు, కోటపాడు జెడ్పీటీసి అనురాధ, వైద్యాధికారి సబ్రమణ్యం, రాజశేఖర్,
మూర్తి, తదితరులు పాల్గొన్నారు.