విజయవాడ : గ్రామ రెవిన్యూ అధికారులందరికీ ఈ బదిలీల్లో పూర్తి అవకాశం
కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
రవీంద్ర రాజ్ కోరారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కి రాష్ట్రరెెవెన్యూ అధికారుల
సంఘ ప్రతినిధులు ఈ మేరకు వినతిపత్రాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
సుమారు 15 వేల మంది గ్రామ రెవిన్యూ అధికారులు పనిచేస్తున్నారు. వీరందరికీ
గతంలో బదిలీల విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న 13 జిల్లాలు
ఇప్పుడు 36 జిల్లాలు అయినందున, ఎవరి సొంత జిల్లాలో వారికీ దగ్గర మండలాల్లో
బదిలీలకు అవకాశం కల్పించాలని కోరిన గతంలో చేయలేదు. ఇప్పుడైన 26 జిల్లాలు
ప్రాంందికర ఎవరి దాంత జిల్లాలో వారికి దగ్గర మండలాల్లోకి బదిలీలకు అవకాశం
కల్పించాలని కోరుకున్నాము. అలాగే గ్రేడు 3 వీబ్వేలు అందరికీ, వారి యొక్క సొంత
జిల్లాలో, దగ్గర మండలాల్లో, మున్సిపల్, కార్పొరేషన్ లలో బదిలీలకు అవకాశం
కల్పించాలని కోరారు. ఇప్పటికి వీరందరూ 15000 రూపాయలు జీతంతో 100 నుండి 150
కిలోమీటర్ల దూర ప్రాంతం నుండి విధులు నిర్వహించడం వల్ల వీరు ఆర్థికంగా
మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున గ్రామ రెవిన్యూ అధికారులందరికీ
కూడా ఈ బదిలీల్లో పూర్తిగా అవకాశ కల్పిస్తూ అందరికీ న్యాయం చేయాలని కోరారు.