గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నా బిడ్డలు అన్న సీఎం జగన్
గుంటూరు : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కల్పించాలని, నోషనల్
ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్
అధ్యక్షుడు ఎం.డి. జాని పాషా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి
వినతి పత్రం అందించారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా బుధవారం ముఖ్యమంత్రి
క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం,గ్రామ వార్డు సచివాలయ
ఎంప్లాయిస్ ఫెడరేషన్ క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చేతులమీదుగా
ఆవిష్కరించారు.అనంతరం ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి 31 కీలక అంశాలతో
కూడిన వినతిపత్రం అందించారు. అందులో ముఖ్యమైన సాధారణ, అంతర్ జిల్లా బదిలీలు
కల్పించాలని, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించి అమలు చేయాలని తదితర ముఖ్య
విషయాలపై వినతి అందించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.