ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
విజయవాడ : రాష్ట్రంలో చేపట్టిన గ్రామ సచివాలయాల,రైతు భరోసా కేంద్రాల భవన
నిర్మాణాలను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. కలక్టర్లతో నిర్వహించిన
వీడియో సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ ఈ గడువును దృష్టిలో ఉంచుకుని త్వరిత
గతిన ఆనిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వీడియో లింక్ ద్వారా
పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే 6వేల 84 గ్రామ సచివాలయాల భవనాలు
పూర్తి కాగా 1861 ఫినిషింగ్ స్థాయిలోను,825 రెండవ శ్లాబు స్థాయిలోను,523 రూప్
స్థాయిలోను,681 రూప్ లెయిడ్ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. వీడియో లింక్ ద్వారా
పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ
ద్వివేది మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే 3వేల 609
భవనాలు పూర్తి కాగా 1100 బేస్మెంట్ స్థాయిలోను,966 రూప్ స్థాయిలోను ఉన్నట్టు
వివరించారు. వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి యంటి. కృష్ణబాబు మాట్లాడుతూ 8321 వైయస్సార్ హెల్తు
క్లినిక్ల భవనాల్లో 2246 ఈనెలాఖరు లోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
కాగా 632 బిలో బేస్మెంట్ లెవెల్,1571 బేస్మెంట్ స్థాయిలోను ఉన్నట్టు చెప్పారు.
జగనన్నకు చెబుదాం కింద వచ్చే ఫిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించండి :
జగనన్నకు చెబుదాం కింద వచ్చే ఫిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించాలని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు.
కలక్టర్ల తో నిర్వహించిన వీడియో సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ ముఖ్యం గా
ఆర్థికేతర అవసరాలకు సంబంధించిన అంశాలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.
ఈసమావేశంలో సియంఓ పియంయు డిప్యూటీ కలెక్టర్ భవాని శంకర్ మాట్లాడుతూ గత
మేనెలలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకూ 74వేల 168
ఫిర్యాదులు రాగా వాటిలో 53 వేల వరకూ పరిష్కారం అయ్యాయని చెప్పారు.70 శాతం వరకు
ఫిర్యాదులు రెవెన్యూ,పిఆర్ అండ్ ఆర్డి, ఇంధన,ఎంఏయుడి,హోం శాఖలకు సంబంధించినవే
ఉన్నాయని పేర్కొన్నారు.అంతే గాక ఫిర్యాదుల్లో అధికశాతం ఆర్థికేతర అవసరాలకు
సంబంధించినవే ఉంటున్నా యని తెలిపారు. ఈవీడియో సమావేశంలో వివిధ జిల్లాల
కలెక్టర్లు,జెసిలు తదితరులు పాల్గొనగా సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్
రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.