వెలగపూడి : ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు గ్రామ
సర్వేయర్ గ్రేడ్ -1, గ్రేడ్ -2, గ్రేడ్ -3 పోస్టులను కొత్తగా సృష్టించింది.
అయితే గ్రామ సర్వేయర్ లను మూడు గ్రేడ్లుగా విభజించడం వల్ల ప్రమోషన్ ఆలస్యం
అవుతుంది. కావున వీటిని రెండు గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించాలని ఆంధ్రప్రదేశ్
గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్
ముఖ్యమంత్రి ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా
స్పందించిన ముఖ్యమంత్రి దీనిపై మేము కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని
అధికారులను ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు జీఓ నంబర్
161 ద్వారా గ్రామ సర్వేయర్లను రెండు గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరిస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్
-3 గ్రామ సర్వేయర్లు అందరూ గ్రేడ్ -2 గ్రామ సర్వెయ్యర్లుగా మారతారు. గ్రామ
సర్వేయర్ గ్రేడ్ లను తగ్గించి గ్రామ సర్వేయర్లకు ప్రమోషన్ అవకాశాలు
మెరుగుపరిచిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన
ప్రసాదరావు, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సర్వే
కమిషనర్ సిద్ధార్థ్ జైన్ కి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు.