పైలట్ ప్రాజెక్టుగా అనకాపల్లి జిల్లాలో వంద శాతం క్యాన్సర్ స్క్రీనింగ్
క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అన్ని ఆసుపత్రుల్నీ సంప్రదిస్తున్నాం
ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తించగలిగితే నివారించడం సులభం
జిల్లాల్లో నిర్దేశిత ప్రాంతాల్లో టార్గెట్ గ్రూపులకు వంద శాతం స్క్రీనింగ్
పట్టణాల్లో హెల్త్ హబ్ నిర్మాణానికి ఉచితంగా భూమి కేటాయింపు
హెల్త్ హబ్ ల నిర్మాణానికి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ముందుకు రావాలి
రాష్ట్రంలో టెరిసరీ వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు వెల్లడి
అమరావతి : గ్రామ స్థాయిలో వంద శాతం క్యాన్సర్ స్క్రీనింగ్ కు గాను కార్యాచరణ
ప్రణాళికను రూపొందించామని, ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో వంద శాతం క్యాన్సర్
స్క్రీనింగ్ చేసేందుకు వైజాగ్ లోని హెూమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి పైలెట్
ప్రాజెక్టు కింద చేపడుతోందని వైద్య ఆరోగ్య శాఖ స్పె షల్ చీఫ్ సెక్రటరీ
ఎం.టి.కృష్ణబాబు అన్నారు. ఇందుకు గాను గ్రామ స్థాయిలో నియమించిన సిహె చ్వో
(ఎంఎల్చ్ఎ), ఎఎన్ఎం, ఆశాలకు తగిన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు
చేస్తున్నామన్నారు. న లభయ్యేళ్లు పై బడిన మహిళలకు మేమోగ్రామ్ తో పాటు,
నిర్దేశిత వయసు వారికి ఓరల్, సర్వయిక ల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేసేందుకు
వీలుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సాయాన్ని తీసుకుంటామన్నారు.
తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో క్యాన్సర్, మెదడు రుగ్మతలు, గుండె జబ్బుల్ని
గుర్తిం చేందుకు అత్యాధునిక పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్ సిటీ) స్కాన్,
3డి మేమో గ్రఫీ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
ఎం.టి.కృష్ణబాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంక్రమిక(కమూ ్యనికబుల్ డిసీజెస్) వ్యాధుల నుండి
అసాంక్రమిక (నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్) వ్యాధుల దిశగా నివారణా భారం
పెరుగుతున్న నేపథ్యంలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ ప్రణాళిక ద్వారా
క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆరోగ్యశ్రీ కింద
గతేడాది రూ.600 కోట్లు అ ర్చు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 62 వేల నుండి
70 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోద పుతున్నాయన్నారు. పునర్విభజనాంతరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ నివారణా సౌకర్యాల్ని మెరు గుపరిచే దిశగా
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారనీ,
అందులో భాగంగానే సమగ్ర క్యాన్సర్ నివారణా విధానాన్ని రూపొందించామనీ కృష్ణబాబు
చెప్పారు. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి
చికిత్సను అందించగలిగితే వారి జీవన ప్రమాణం మెరగవుతుందని, నివారణ కూడా
సాధ్యమవుతుందని, ఖర్చుకూడా తగ్గుతుం దని చెప్పారు. క్యాన్సర్ కు సంబంధించి
అధునాతన చికిత్స కోసం దాదాపు 20 శాతం మంది రోగు లు బెంగుళూరు, చెన్నయ్ వంటి
నగరాలకు వెళ్తున్నారని, మన రాష్ట్రంలో కూడా టెరిషరీ వైద్య సేవల్ని
మెరుగుపర్చుకుంటే వారికి కూడా ఇక్కడే చికిత్స అందించవచ్చని కృష్ణబాబు అన్నారు..
హెల్త్ హబ్ నిర్మాణానికి ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకురావాలి: కృష్ణబాబు పిలుపు
రాష్ట్రంలో టెరిషరీ వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వం
తీసుకొచ్చిన హెల్త్ హబ్ పాలసీలో భాగస్వామ్యమయ్యేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల
యాజమాన్యాలు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
ఎం.టి.కృష్ణబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పాలసీలో పట్టణ ప్రాంతాల్లో
హెల్ హబ్ ల నిర్మాణానికి గాను ప్రభుత్వం ఉచి తంగా భూమిని కేటాయిస్తుందన్నారు.
ఈ అవకాశాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు సద్వినియోగం చేసు కోవాలన్నారు. మణిపాల్
హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ క్యాన్సర్‌లో ఏ
పీలో అధునాతన వైద్య చికిత్సల్ని అందుబాటులోకి తెచ్చేందుకు తమ వంతు కృషి
చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి పనిచేసేందుకు ఎల్లవేళలా సిద్దంగా
వున్నామన్నారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ , బోన్ మ్యారో ట్రాన్స్
ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి, మణిపాల్ ట్రూటెస్ట్ ఆపరేషన్స్
హెడ్ ప్రెసిడెంట్ నీరజ్ అరోరా, సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ సతీష్ బాబు ఈ
కార్యక్ర మంలో పాల్గొన్నారు.