హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు
ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్ 11న
నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్
లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను
రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 16న
గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న
డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని
పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.