విజయవాడ : విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ
ప్రిన్సిపల్ సెక్రెటరీ, సాయి ప్రసాద్ ని కలిసి ఈ రాష్ట్రంలో 111 జీవో ద్వారా
కారుణ్య నియమకాల ద్వారా నియామకమైన వారికి, ప్రొబిషన్ డిక్లేర్ కొరకు సర్వే
ట్రైనింగ్ 4 నెలలు నుండి, మార్పు చేస్తూ 42 రోజులు మాత్రమే సర్వే ట్రైనింగ్
నిర్వహించి, వారి ప్రొబేషన్ కు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ
రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు.
అలాగే 417జీవో ప్రకారం గ్రేడ్2 వారికి కూడా నాలుగు నెలల సర్వే ట్రైనింగ్
పూర్తి అయితేనే గాని ప్రొబిషన్ డిక్లేర్ ఆవద్దని నిబంధన పెట్టినందున, ప్రస్తుత
పరిస్థితుల్లో నాలుగు నెలల సర్వే ట్రైనింగ్ ఇవ్వడం సాధ్యపడినందున, 111 జీవో,
417 ప్రకారం కారుణ్య నియమాల కింద జాయిన్ అయిన విఆర్ఓ లందరికీ 15 రోజులు లేక 42
రోజులు సర్వే ట్రైనింగ్ నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు
భూపతి రాజు రవీంద్ర రాజు వినతి పత్రం సమర్పించారు. అలాగే గ్రేడ్2 విఆర్ఓల
ప్రొబిషన్ కి సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని కోరినట్లు ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తెలిపింది.