న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మన్సుఖ్
మాండవీయ, కిషన్ రెడ్డిలను ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,
పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ ఢిల్లీలోని వారి ఛాంబర్లలో మర్యాద పూర్వకంగా
కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్
ఇన్వెస్టర్స్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులను
పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్తో కలిసి ఆయన ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఐ.టీ, నైపుణ్య శాఖ ముఖ్య
కార్యదర్శి సౌరభ్ గౌర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, సలహాదారు లంకా శ్రీధర్
పాల్గొన్నారు.