విశాఖపట్నం : వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు సంబంధించిన లోగోను రాష్ట్ర పరిశ్రమల శాఖ
మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం ఆవిష్కరించారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో
ఏపీఐఐసీ, డిఐసి అధికారులతో సమావేశమైన మంత్రి అమర్నాథ్ సమ్మిట్ కి సంబంధించి
పలు అంశాలపై చర్చించారు. సమ్మిట్ కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకటి, రెండు
రోజుల్లో అందుబాటులోకి తేనున్నామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. ఇప్పటికే పలు
దేశాలను చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు సుముఖత
వ్యక్తం చేశారని మంత్రి అమర్నాథ్ వివరించారు. ప్రపంచ దేశాల నుంచి
పెట్టుబడులను రాబట్టి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపడమే
కాకుండా, అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి ఆకాంక్ష అని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల
శాఖ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.వి. కరుణాకర్
ఏపీఐఐసీ జెడ్.ఎం. సి.హెచ్. రంగయ్య తదితరులు పాల్గొన్నారు.