విశాఖపట్నం : సీఎం జగన్ నాయకత్వంలో పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సత్వరమే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తాం. రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉంది. పెట్టుబడులకు అవకాశాలు అపారం. పారిశ్రామికంగా అనుకూల అవకాశాలున్నాయ ని ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇక, ఈ సందర్బంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉందన్నారు.