శ్రీ భరణి ప్రింటింగ్ ప్రెస్ అధినేత చీపుళ్ళ నాగేశ్వరరావు కి ఘన సత్కారం
విజయవాడ : అంతర్జాతీయ ముద్రాపక దినోత్సవ వేడుకలు సందర్భంగా పాతబస్తీలో శ్రీ
భరణి ప్రింటింగ్ ప్రెస్ అధినేత, విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్ గౌరవ
సలహాదారులు చీపుళ్ళ నాగేశ్వరరావు ని విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు
ఘనంగా సన్మానించారు. ప్రపంచంలో ముద్రణకు ఆద్యులు ముద్రణా రంగ పితామహులు
జోహన్స్ గుటెన్ బర్గ్ జయంతి సందర్భంగా విజయవాడలో చుట్టుగుంట లోని ఎఫ్ అండ్
జైన్ మెమోరియల్ ఈస్ట్ లయన్స్ మల్టీ సర్వేస్ సెంటర్ హోల్లో ముద్రాపక దినోత్సవ
వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోహన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి
ఘనంగా నివాళులర్పించారు. తొలుత ముద్రణ రంగంలో అమరులైన వారికి నివాళులు
అర్పించారు. ప్రపంచంలో ముద్రణా రంగంలో చోటుచేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని
తామంతా అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
ముద్రణా రంగానికి ఎస్ బి ఐ వారు అందించే రుణాలు మంజూరు గురించి అవగాహన
కల్పించారు.
రంగంలో సీనియర్లు, ప్రముఖులను సత్కరించారు. అయితే ఎన్నో విధాలుగా సమాజానికి
సేవల చేస్తున్న వారందరినీ విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా
గౌరవించి సత్కరించారు. వారిలో పాతబస్తీలో ని శ్రీ భరణి ప్రింటింగ్ ప్రెస్
అధినేత, శివదీక్షా సేవా మండలి నగర కార్యదర్శి, విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్
గౌరవ సలహాదారు, శ్రీ నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్
మెంబర్, సాయి అమరావతి హైట్స్ గౌరవ అధ్యక్షులు గా సేవలు అందిస్తున్న చీపుళ్ళ
నాగేశ్వరరావు ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బి
టి మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెలగా శ్రీనివాస్, కోశాధికారి బి వెంకట
రమణ తదితరులు పాల్గొన్నారు.