ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి వ్యవహారాల శాఖ మంత్రి ఆర్ కె రోజా
రాజమహేంద్రవరం : సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను పరిరక్షించుకోవడం మన అందరి
భాద్యత అని, సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో జగననన్న స్వర్ణోత్సవ
సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం, వీటిలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవ్వడం ఎంతో
సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి వ్యవహారాల శాఖ మంత్రి ఆర్ కె.
రోజా అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మూడు
రోజులు పాటు నిర్వహిస్తూన్న “జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు” జోనల్
స్థాయి కార్యక్రమాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు శాఖ మంత్రి ఆర్
కె.రోజా ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత, పౌరసరఫరాలు శాఖ మంత్రి
కారుమూరి నాగేశ్వరరావు, యంపీ మార్గని భరత్ రామ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్
వాసిరెడ్డి పద్మ, రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిళారెడ్డి, శాసనసభ్యులు జక్కంపూడి
రాజా, కురసాల కన్నబాబు, సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ వంగపండు ఉష, మున్సిపల్
కమీషనర్ కె. దినేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి ఆర్. కె. రోజా మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని అయిన
రాజమహేంద్రవరంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా
ఉందన్నారు. ఈ సంబరాలను ప్రధానంగా నాలుగు జోన్లగా ఉత్సవాలు నిర్వహిస్తున్నా
మన్నారు. ఇప్పటికే తిరుపతి, గుంటూరు పట్టణాల్లో జరుపుకోగా, నేడు రాష్ట్ర
సాంస్కృతిక నగరంగా ప్రసిద్ది చెందిన రాజమహేంద్రవరంలో ఈ ఉత్సవాలను
నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో ప్రత్యక్ష భాగస్వామ్యం ఎంతో ఆనందంగా
ఉందన్నారు. ఈ నగరంలో ఎంతో మంది కవులు కళాకారులు, సంఘ సంస్కర్తలు
జన్మించారన్నారు. తెలుగు భాషకు అంకురార్పణ చేసిన ఆదికవి నన్నయ్య ఈ
ప్రాంతంవారేనని, గోదావరి ప్రాంతంలో వెయ్యి సంవత్సరాలు గా సంస్కృతి, సాహిత్యం,
కళలు ఎలా విరాజిల్లుతున్నయో మనందరికీ తెలుసు అన్నారు. గోదావరి భాషకు ఒక
ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. సీనీరంగంలో ఎంతో మంది కళాకారులు అల్లు
రామలింగయ్య నుంచి ఆలీ, మెగాస్టార్ చిరంజీవి నుంచి రెబల్ స్టార్ కృష్ణంరాజు
వరకు ఎస్పీరంగారావు నుంచి గిన్నిస్ బుక్ లో నమోదైన దర్శకరత్న దాసరి
నారాయణరావు, జయప్రద, భానుప్రియ ఈ గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన వారేనని
పేర్కొన్నారు. పేద , ఔత్సాహిక కళాకారులను గుర్తించడం కోసం ఇటువంటి
కార్యక్రమాలు చేస్తుంటే కొంత మంది దీనిని కూడా విమర్శ చెయ్యడం వారి విజ్ఞత కే
వదిలి వేస్తున్నట్లు ఆమె అన్నారు. వైఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటి సారి
ముఖ్యమంత్రి అయినప్పటికీ దేశంలో ప్రధానమంత్రితో సహా అన్నిప్రాంతాల వారు మన
వైపు చూసే విధంగా సీయం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అండగా అనేక సంక్షేమ
పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గడప గడపకు వెళ్ళి ఇప్పటికే చేసినవి కాకుండా
గ్రామాల్లో ప్రజలకు ఇంకా ఏమీ అవసరమో తెలుసుకుంటూ వారి సంక్షేమాన్ని
కోరుకుంటున్నారన్నారు.
రాష్ట్ర హోమంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ, సాంస్కృతిక శాఖా మంత్రిగా ఒక
కళాకారిణి ఉంటే వారి కష్టాలను తెలుసుకుని వారిని ఎలా ప్రోత్సహించ వొచ్చు అనే
విధంగా మంత్రి రోజా ఆ శాఖా మంత్రిగా తనదైన ముద్ర తో సమర్థవంతంగా శాఖ నిర్వహణ
చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో కళాకారులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో
ముఖ్యమంత్రి గుర్తించారన్నారు. కళాకారులు వేదకలపై వారి పదర్శనను ఇచ్చేందుకు
అవకాశాలు ఉండవని సీయం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహంతో నేడు ఈ కార్యక్రమాలు
ద్వారా ప్రతి కళాకారునికి ప్రదర్శించే అవకాశం కల్పించి
ప్రోత్సహిస్తున్నారన్నారు. పేదరికంలో భాదపడుతున్న కళాకారులుకు జగనన్న
ప్రభుత్వం వారి పిల్లలను చదువు, సొంత గృహుహాలు అందించడం, మహిళలకు సాధికారిత
దిశగా ఎంతో చేస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనకు వచ్చిన కళాకారు లందరు మంచి
స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాన్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి డా
కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని జగనన్న ప్రభుత్వం అందిస్తున్న
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. భారతదేశంలో ఏ
ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కళాకారుల
కొరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడ ద్వారా వారిని మరింత ప్రోత్సహించడం
జరుతుందన్నారు. పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ డా. బిఆర్
అంబేద్కర్ కోరిన విధంగా సమసమాజ స్థాపనకై పేదరికమే అర్హతగా కులమతాలకు అతీతగా
రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. నేడు ఎంతో చరిత్ర
కలిగిన రాజమహేంద్రవరంలో జగనన్న సర్ణోత్సవ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకోవడం చాలా
సంతోషం అన్నారు. రాష్ట్ర మహిళా కమీషన్ డా. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా
ఉండటమే కాకుండా, ఇటువంటి సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తు కళాకారులను, కళలను,
సాహిత్యాన్ని ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు.
శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఎంతో చరిత్ర గలిగి సాంస్కృతిక నగరంగా
విరాజిల్లుతున్న రాజమహేంద్రవరంలో నవతాలికుడు -వైతాలికుడు అయిన వీరేశలింగం
ఇక్కడే జన్మించి అనేక కార్యక్రమాలు కొనసాగించారన్నారు. సీయం ఏ ఒక్క
ప్రాంతాన్ని విడవకుండా అన్ని ప్రాంతాలను సమ అభివృద్ది చేస్తున్నారన్నారు.
గోదావరి జిల్లా చరిత్రను ఇనుమడింప చేసే విదంగా మ్యూజియం ను ఏర్పాటు చేసి
పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయాలని మంత్రిని కోరారు. శాసనసభ్యులు జక్కంపూడి
రాజా మాట్లాడుతూ, కళాకారులను ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సహిస్తుందన్నారు.
వివిధ ప్రాంతాల్లోని కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషంగా
ఉందన్నారు.
రుడా చైర్ పర్శన్ ఎమ్. షర్మిళా రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల
కొరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో టూరిజం ని
మరింత అభివృద్ది చేయాలని మంత్రిని కోరారు. మున్సిపల్ కమీషనరు కె. దినేష్
కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే విధగా
ఇటువంటి జోనల్ స్థాయి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులను
ప్రోత్సహంచడం వల్ల కళాకారుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందన్నారు. సాంస్కృతిక
వ్యవహారాల శాఖ చైర్ పర్శన్ వంగపడు ఉష తన దైన శైలిలో తన గాత్రంతో ” ఏంపిల్లా
ఎల్థామొస్తవా” అంటూ ఆలపించిన గేయం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.కార్యక్రమంలో
రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, పౌరసరఫరాలు శాఖ మంత్రి కారుమూరి
నాగేశ్వరరావు,యంపీ భరత్ రామ్, మహిళా సంక్షేమ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ,
రుడా చైర్ పర్సన్ షర్మిళారెడ్డి, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, కురసాల
కన్నబాబు, సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ వంగపండు ఉష, మున్సిపల్ కమీషనర్ కె.
దినేష్ కుమార్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టరు మల్లిఖార్జునరావు, సంగీత
కళాశాల ప్రిన్సిపాల్ యం. కృష్ణమోహన్, నాట్యాచారుడు పి. శ్రీనివాస శర్మ,వివిధ
కళారూపాల బృందాలు హాజరయ్యారు.