సీనియర్ జర్నలిస్టులకు మంత్రి రోజా సన్మానం
తిరుపతి : ఆధ్యాత్మిక నగరంలో కలం కార్మికుల దేవాలయం అయిన “ప్రెస్ క్లబ్” 29వ
ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ
యూనివర్సిటీ సెనేట్ హాలులో ఏర్పాటు చేసిన వేడుకల సభకు తిరుపతి ఎమ్మెల్యే భూమన
కరణాకరరెడ్డి, మంత్రి రోజా సెల్వ మణీ ముఖ్య విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ కలానికి పదునెక్కువ అని, వారి వార్తకు వేగమెక్కువ అంటూ
సీనియర్ జర్నలిస్టులను ఉద్దేశించి కొనియాడారు. సమయానికి సభ మొదలెట్టి
ప్రసంగాన్ని పూర్తి చేసుకున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
మాట్లాడుతూ తాను గతంలో ఓ ప్రముఖ పత్రికలో పనిచేసినట్లు గుర్తు చేస్తూ పత్రిక
విలువల పై పాత్రికేయులకు భూమన అనుభవాలను రంగరించి, కలం కార్మికులు స్పందించే
విధంగా ఆసక్తికర మాటలతో ఆకర్షించారు. బిజీ షెడ్యూల్లో భాగంగా భూమన కరుణాకర్
రెడ్డి పాత్రికేయుల సభకు సెలవిచ్చి వెళ్లాల్సి వచ్చింది. తన చిన్ననాటి
రోజుల్లో పాత్రికేయులు రాసే వార్తల్లో నూరు శాతం నిజాలు ఉండేవన్నారు. నేడు
యాజమాన్యం చేతుల్లో కీలు బొమ్మలుగా మారి, వార్తల్లో కొంత పక్కదారి
పడుతున్నట్లు మనోఘాతాన్ని వ్యక్తం చేశారు. అయినా మీడియా మిత్రులు వార్త సేకరణ
సమయంలో ఉద్యోగరీత్యా అలా నడుచుకోవాల్సిన పరిస్థితి అని స్పష్టం చేశారు.
ప్రెస్ క్లబ్ కార్యవర్గం కోరిన వెంటనే సీనియర్ పాత్రికేయులకు, కమిటీకి, కలం
కార్మికులకు మెమొంటోలు ఇచ్చి శాలువా కప్పి, శ్రీవారి ఫోటోలను అందించి ఘనంగా
సన్మానించారు. నగరపాలక సంస్థ ఉపమేయర్ ముద్ర నారాయణ “ప్రెస్ క్లబ్ నిధి”కి
50వేల రూపాయలను ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి నగదు రూపంలో అందజేసి
జర్నలిస్టులచే అభినందించబడ్డారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎస్వీయూ వి. సి.
రాజారెడ్డి తదితర ప్రముఖులు కూడా విచ్చేయగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,
కార్యదర్శులు జోగి రెడ్డి భాస్కర్ రెడ్డి, బాలచంద్ర, కోశాధికారి శ్రీకాంత్
రెడ్డి, మాజీ కార్యవర్గం పెద్దలు శ్రీధర్, అక్షింతలు నాగరాజు, నరేంద్ర,
సుధీర్ రెడ్డి, 10 టివి మురళి, ఈనాడు రాజేంద్ర, గాంధీ కార్యవర్గంతో కలిసి ఈ
కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.