పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా
జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సిఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో
వర్థిల్లాలని కోరుతూ కేసీఆర్ అభిమానులు, పార్టీ నేతలు, శ్రేణులు, పలువురు
ప్రముఖులు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచం నలుమూలలనుంచి
లక్షలాదిగా సిఎం కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఫోన్లో మాట్లాడి సిఎం కేసీఆర్ కు
జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ
జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్, మాజీ
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తమ
శుభాకాంక్షలు తెలిపారు.
నాయకులు సతీష్ రెడ్డి, దూసరి అశోక్ గౌడ్, రత్నాకర్, అబు జాఫర్, షణ్ముగ రెడ్డి
ఆధ్వర్యంలో జరిగిని వేడుకలో 150 మందికి పైగా హాజరయ్యారు. యుఎస్ ఎ లో హరీష్
రెడ్డి ఆధ్వర్యంలో, బహ్రెయిన్ లో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, జర్మనీలో అరవింద్
బాబు, రాజీవ్ ఆధ్వర్యంలో, ఖతర్ లో శ్రీధర్ ఆధ్వర్యంలో, న్యూజిలాండ్ లో జగన్,
విజయ్ ఆధ్వర్యంలో, సౌతాఫ్రికాలో గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో, డెన్మార్క్ లో
శ్యామ్ ఆకుల ఆధర్యంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ
సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
ఢిల్లీ, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ సహా జాతీయ స్థాయిలో సంబరాలు
బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు
ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఢిల్లీ బిఆర్ఎస్ జాతీయ
కార్యాలయంలో పలువురు నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు
జరిపారు. ఒడిశా రాష్ట్రంలో బిఆర్ఎస్ శ్రేణులు అధినేత పుట్టిన రోజును ఘనంగా
జరిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో సిఎం కేసీఆర్ గారి పుట్టిన రోజు వేడుకలు
ఘనంగా జరిగాయి.
ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో అధినేత పుట్టిన రోజు
సంబురాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపారు. బెజవాడ
దుర్గామాతగుడిలో సిఎం కేసీఆర్ గారి క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు
నిర్వహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. బిఆర్ఎస్ పార్టీ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యనేత రావెల కిశోర్ బాబు పలు చోట్ల రక్తదాన శిబిరాలను
నిర్వహించారు. అన్నదానం, పండ్లు ఫలాల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు.
హైద్రాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు, చైర్మన్లు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సిఎంవో
అధికారులు సిబ్బంది తదితరులు సిఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.