విజయవాడ : విజయవాడ కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు
ఇంజనీరింగ్ కాలేజిలో జరుగుతున్న అమరావతి బాలోత్సవం 5వ సాంస్కృతిక కార్యక్రమాలు
మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా గుంటూరు ఏలూరు
జిల్లాలకు చెందిన 161 పాఠశాల నుంచి 7600 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ
సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా
నిర్వహించిన మంగళవారం పలు వేదికలపై జరిగిన కార్యక్రమాలలో పిల్లలు అలరించారు .
దేశభక్తి, గీతా లాపనలో సీనియర్స్ పాల్గొన్నారు. ‘ జయ జయ జయహో దేశభక్తి చాటుతూ
భరతమాత పాటను సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ చెందిన విద్యార్థులలో ఆలపించారు.
భరతమాత పాదాలకు మువ్వలం దేశమాత పాదాలకు మువ్వలం, తేనెల తేటలు మాటలతో గన్నవరం
కు చెందిన స్రవంతి పాఠశాల విద్యార్థినిలు శ్రోతలను అలరించారు. విచిత్ర వేషధారణ
జూనియర్స్ విభాగం నుంచి పలువురు పిల్లలు పాల్గొన్నారు. చరిత్రను వివరిస్తూ
ఝాన్సీ లక్ష్మీబాయి, వీర పాండ్య కట్ట బ్రహ్మన వేషధారణ, శ్రీకృష్ణదేవరాయల
వేషధారణ, రుద్రమదేవి , మన జాతీయ పక్షి నెమలి విచిత్ర వేషధారణలో చూపర్లను
కట్టిపడేసాయి. కోలాటం సీనియర్ విభాగంలో నిర్వహించిన పోటీలు ఆద్యంతం చూపర్లను
ఆకట్టుకున్నాయి. శరణం గణేషా, జయ జయహే మహిషాసుర మర్దిని శైల స్తుతి వంటి పాటలకు
పిల్లలు చేసిన కోలాట నృత్యాలు ఆహుతులను కట్టిపడేశాయి. ఫ్యాన్సీ డ్రెస్ సబ్
జూనియర్స్ విభాగంలో చిన్నారులు తమ నైపుణ్యతను చాటుకున్నారు. విద్యాధరపురం
రవీంద్ర భారతికి చెందిన షేక్ అహ్మద్ డాక్టర్ బాబ సాహెబ్ అంబేద్కర్ లా తన నటనతో
అంబేద్కర్లో అలరించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ సిద్ధాంతాలను
ఆచరించాలని కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని తన ప్రతిభను
చాటుకున్నారు. పెదవడ్లపూడి విజేత స్కూలుకు చెందిన కె మాన్విత న్యూస్ పేపర్లతో
ఫ్యాన్సీ డ్రెస్ తో అలరించింది. కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని ప్లాస్టిక్
కవర్లు నిషేధించాలని వేషధారణలో తన ప్రతిభ కనబరిచింది. సబ్ జూనియర్స్, విభాగంలో
రైమ్స్ తెలుగు, ఇంగ్లీష్ తమ ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్నారు. జూనియర్స్,
సీనియర్స్ విభాగాలలో వక్తత్వం తెలుగు, ఇంగ్లీషు లలో, పద్య భావం , క్విజ్,
డిబేట్, తెలుగులో మాట్లాడటం వంటి పోటీలలో పిల్లలు తమదైన శైలిలో ప్రతిభను
చాటారు.
మట్టితో బొమ్మలు తయారీలో 300 మంది విద్యార్థులు
బాలోత్సవం ఐదవ పిల్లల పండగ చివరి రోజు మంగళవారం కళాశాల ప్రాంగణంలో 300 మంది
విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మట్టితో తమ ప్రతిభను కనబరుస్తూ వివిధ రకాల
బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మట్టి బొమ్మల తయారుచేస్తున్న సందర్భంగా
బాలోత్సవ నిర్వాహకురాలు పి.ఙ్యోత్న, నలంద ఎన్ ఎస్ ఎస్ ఇన్చార్జ్ కె.వి.ఆర్
పర్యవేక్షించారు. విద్యార్థులు మట్టి తోచేసిన బొమ్మలలో చూపర్ లను
ఆకట్టుకుంది. వివిధ రకాల పండ్లు, మొక్కలతో, పార్కు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్,
విమానం, వినాయకుని ప్రతిభలు, బోటు పండుగ శోభను సంకరించుకునేలా పల్లెటూరి
వాతావరణం లో బొమ్మలను తీర్చిదిద్దారు.