కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
కలువాయి తహసీల్దార్, వైయస్సార్ క్రాంతి పధం కార్యాలయంల్లో అధికారులు రిపబ్లిక్ డేని ఘనంగా జరిపారు.జాతీయ జెండా ను డీప్యూటీ తహసీల్దార్ మంజుల, వైయస్సార్ క్రాంతి పధం వద్ద ఎంపీపీ లక్ష్మి దేవి,ఏపీఎం సారా స్రవంతి ఎగురా వేశారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ అనీల్ కుమార్ రెడ్డి జాతీయ జెండా కు వందనం చేశారు.ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ….రిపబ్లిక్ డే జాతీయ పండుగ అని చెప్పారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు స్వాతంత్ర దినోత్సవం,రిపబ్లిక్ డే లని ఆయన తెలియ జేశారు. రాజ్యాంగం ఆధారం గానే పాలన నడుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది, వైయస్సార్ క్రాంతి పధం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.