విజయవాడ : విజయవాడ నగరంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన బాలమేళా
కార్యక్రమం విజయవంతమైంది. “సేవాహి పరమో ధర్మహా” అన్న నాధంతో, నినాదంతో
సేవాభారతి విజయవాడ 1990లో ప్రారంభమై వివిధ సేవా బస్తీలలో వారి అవసరాలకు
అనుగుణంగా ఎప్పటికప్పుడు అనేక సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో
నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమాలలోని మన సంస్థ ప్రతిష్టాత్మక నిర్వహించే
కార్యక్రమం “అభ్యాసిక” — “ఉచిత ట్యూషన్ సెంటర్” లపై ఓసారి దృష్టి
సారిద్దాం..‘సేవా భారతి -విజయవాడ’ సేవా బస్తీలలోని బాల బాలికలకు, వారు
ఎదుగుతున్న వయస్సులో, వారి అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు, అవకాశాలను
అందించడానికి గత 33 ఏళ్ళుగా అంకితమై పనిచేస్తున్నది. ఈ పిల్లలు బాధ్యతాయుతమైన
పౌరులుగా, ప్రయోజకులుగా తయారై వారి కుటుంబాలకు, సమాజానికి, దేశానికి
ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దడమే ఈ సంస్థ లక్ష్యం.వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణను అందిస్తుంది.
అలాగే వారు వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ వివిధ సాంస్కృతిక, సాహిత్య
కార్యకలాపాలలో పాల్గొనేలా కూడా వారిని ప్రోత్సహిస్తోంది. విజయవాడ మహానగరంలోని
జక్కంపూడి కాలనీ, రాజ రాజేశ్వరి పేట, కేదారేశ్వర పేట, నులక పేట, అజిత్ సింగ్
నగర్, వెంకటేశ్వర నగర్, డోలాస్ నగర్, రామరాజ్య నగర్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
కొండ మెట్లు, ఇతర ప్రాంతాలలో 48 ఉచిత ట్యూషన్ సెంటర్ల ద్వార మొత్తం 994 మంది
బాలబాలికలు లబ్ధి పొందుతున్నారు. ఈ కేంద్రాలు రోజుకు 2 గంటల పాటు, వారానికి 6
రోజులు, సంవత్సరం మొత్తం మీద 11 నెలల పాటు ఈ చిన్నారుల సమగ్ర వికాసం కొరకు
పనిచేస్తున్నాయి. ఈ చిన్నారులకు నిర్వహిస్తున్న వార్షిక సమ్మేళనమే
“బాల-మేళా”. ఈ పిల్లలకు అనేక ఆటలు పాటల పోటీలలో విజేతలకు బహుమతుల
ప్రదానోత్సవంతో అందరినీ ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి.
ఆదివారం మొగల్ రాజపురం సిద్దార్ధ ఆడిటోరియంలో నిర్వహించారు.

సేవా భారతి చేసిన ముఖ్యమైన సేవా కార్యక్రమాలు
పోలవరం ప్రాంతాన్ని గోదావరి ముంచెత్తినప్పుడు 18 గ్రామాలలోని 2450 కుటుంబాలకు
భోజనం, నిత్యవసరాలు, మందులు అందించాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు
ఇతర అత్యవసర పరిస్థితులలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి తమ నిరుపమాన సేవలను
అందించే ఏకైక సంస్థ సేవాభారతి మాత్రమే. మరింత మెరుగైన సమాజం కోసం నిస్సందేహంగా
మేము మరింత ఉత్తమంగా, నాణ్యతతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఆవిశ్రాంత,
అవిరళ కృషి సలుపుతాము. ఈ మూడు దశాబ్దాల కాలగతిలో మన ఈ సంస్థ కార్యకలాపాలపై
విశ్వాసముంచి, తమ సహకారాన్ని, మద్దతును అందించిన విలువైన పోషకులందరికీ
సేవాభారతి విజయవాడ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.