కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 28 వర్ధంతి ని కలువాయి మండలం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా కలువాయి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలువాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో కలువాయి టౌన్ అధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.