వెంకటగిరి : వెంకటగిరి అభివృద్ధి ప్రదాతకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని, ఆయన అడుగుజాడల్లోనే మనమందరం పయనించాలని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమళ్ళి రామ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి శ్రీశేషులు జనార్దన్ రెడ్డి 89వ జయంతి సందర్భంగా మంగళవారం పేర్కొన్నారు. వెంకటగిరిలో శాసనసభ్యులుగా గెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో అంకితభావంతో పనిచేసిన ఆయన ఆలోచన విధానాలను గుర్తు చేసుకుంటూ త్రిభువని సెంటర్ నందు ఏర్పాటుచేసిన విగ్రహానికి కుటుంబ సభ్యులతో పూలమాలు వేసిఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ఈ నియోజకవర్గ ప్రజలు మా కుటుంబాన్ని ఎంతో ఆప్యాయతో అమ్మని నాన్నని ఆదరించినారని అందుకని మేము కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందామని, రానున్న ఎన్నికల్లో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తనవంతుగా రక్తదానం చేయడమే గాక ఎంతోమంది నేదరమల్లి అభిమానులు కార్యకర్తలు రక్తదానం చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న రోగులకు రొట్టె పండ్లు పంపిణీ చేసి, తిరువని సెంటర్లో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నక్క భానుప్రియ, రాష్ట్ర చేనేత కమిటీ సభ్యులు నక్క వెంకటేశ్వర్రావు, వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఆర్టీసీ చైర్మన్ చెలికం శంకర్ రెడ్డి, వైసీపీ పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు,తిరుపతి పార్లమెంటరీ సభ్యులు చిట్టి హరికృష్ణ, ఆరి శంకరయ్య, రాధమ్మ, కందటి కళ్యాణి, నారాయణ,సుబ్బారావు,తదితరులు పాల్గొన్నారు.