గుంటూరు : ఎన్నారై టిడిపి సెల్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ 27వ వర్ధంతి
సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్ఏ, కువైట్ తదితర దేశాల నుండి వచ్చిన
ఎన్ఆర్ఐటిడిపి నాయకులు చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు
దాదాపు 20 నిమిషాల పాటు వారి కార్యాలయం నందు ఎన్నారైలతో ఎన్నో విశేషాలు,
వారికి చేసినటువంటి ఎన్నో పథకాల గురించిన విశేషాలు పంచుకున్నారు. చంద్రబాబు
నాయుడు ఎన్నారై లతో పంచుకున్న ముఖ్య విశేషాల్లో “రాబోయే 20 ఏళ్లలో
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇప్పటికే
టాప్ లో ఉన్న యూదులను (ఇజ్రాయిల్ ప్రజలను) దాటి ఇంకా పైకి ఎదగాలని, దానికి
అనుగుణంగా ప్రతి ఒక్కరు కష్టపడాలని ఆకాంక్షించారు”. ప్రతి ఒక్కరూ కష్టపడి
సంపాదించి సొంతగా వ్యాపారాలు పెట్టుకొని మరి కొంతమంది తెలుగువారికి సహాయపడి
వారిని కూడా వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ
రూపొందించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రం విడిచి వెళ్తే
తెలుగుదేశానికి ఓటు వేసే వాళ్ళు తక్కువ అవుతారు. అది పార్టీకి నష్టం అయినా
కూడా తాను ఈ నష్టాన్ని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే
ఉద్దేశంతోటే గతంలో ఎన్నో కాలేజీలు పెట్టి విద్యార్థులను ఆ దిశగా
ప్రోత్సహించబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు గర్వించే స్థాయిలో ఉండటం
ఒక విశేషం అని గత స్మృతులను ఎన్నారై టిడిపి సభ్యులతో పంచుకున్నారు.