వెలగపూడి : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బుధవారంహైకోర్టులో చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్స్ సిద్ధార్థ లూథ్ర, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేశ్కూ ముందస్తు బెయిల్ మంజూరైంది.