అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబును తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్లు కలిశారు.
ఇటీవల అస్మిత్‌రెడ్డి, ఇతర నేతలపై వైసీపీ శ్రేణుల దాడి వివరాలను కౌన్సిలర్లు,
చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాడి చేసి తమపైనే కేసులు పెట్టారని
వివరించారు. కొందరు అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం
చేశారు. తనను డీఎస్పీ చైతన్య కులం పేరుతో దూషించి అవమానించారని కౌన్సిలర్
మల్లిఖార్జున్ వాపోయారు. బాధితులను నిందితులుగా చిత్రీకరిస్తూ అరాచకం
సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కౌన్సిలర్‌పై ఇప్పటికే 10కి
పైగా కేసులు పెట్టారని కౌన్సిలర్లు తెలిపారు. వార్డులో పర్యటిస్తుంటే వైసీపీ
నేతల నుంచి దాడులు ఎదురవుతున్నాయని చంద్రబాబుకు వివరించారు. ఇటీవల తాడిపత్రిలో
3వ వార్డులో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అశ్మిత్‌రెడ్డి పర్యటిస్తుంటే
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రోద్బలంతో కొందరు వైసీపీ నేతలు,
అల్లరిమూకలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి
నిరసన తెలిపారు. గాజులపాలెం వీధిలో తాడిపత్రి టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్
జేసీ అస్మిత్ రెడ్డి పై జరిగిన దాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో ఆందోళన
చేపట్టారు. పట్టణంలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన
తెలిపారు. ‘తాడిపత్రిని ప్రశాంతంగా ఉండనివ్వండి’ అనే ఫ్లకార్డును ప్రభాకర్
రెడ్డి మెడలో వేసుకుని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ
నిర్వహించారు.