చంద్రబాబు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల
షర్మిలను సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు దంపతులు
కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన షర్మిల
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి రావాలని బాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తమ నివాసానికి వచ్చిన షర్మిలను చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా వీరితో చేతులు కలిపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, షర్మిల మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరిగిందన్న అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడారు.