చంద్రబాబు,పవన్ కల్యాణ్ లే అరాచకాలు సృష్టిస్తున్నారు
వైయస్సార్ సిపికి ఆంధ్రప్రదేశ్ అభివృధ్ది,సంక్షేమం తప్ప మరే ప్రాధాన్యత లేదు
రుషికొండ తవ్వకాల గురించి అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్లు చిత్రీకరిస్తున్నారు
చంద్రబాబు అమరావతిలో జీవనవిధానాన్నే నాశనం చేశారు
మీడియాతో ప్రభుత్వసలహాదారులు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు : రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని అందుకు వైయస్ జగన్
అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలే కారణం అని ప్రభుత్వసలహాదారులు
(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి
క్యాంప్ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయనను మీడియా ప్రతినిధులు కలసి
మాట్లాడిన సందర్భంలో పలు అంశాలపై వారు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు
చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ 2014 -19
మధ్య చంద్రబాబు విజయవాడ రోడ్లన్నీ ఎలా బ్లాక్ చేసారో అందరికి తెలుసు. గతంలో
ప్రతిపక్షనేతగా మా నాయకుడు వైయస్ జగన్ వైజాగ్ వెళ్లబోతే రన్ వే పై ఎలా
అడ్డుకున్నారో చూశారు. జేసి దివాకర్ రెడ్డి బస్ ప్రమాదం సందర్భంలో సైతం వైఎస్
జగన్ ప్రతిపక్షనేతగా బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ సీన్ టిడిపి
వాళ్ళు సీన్ క్రియేట్ చేశారు. మా రోజమ్మ ఎంఎల్ఏ గా అప్పటి స్పీకర్
నిర్వహిస్తున్నమహిళా సదస్సుకు హాజరుకాబోతే ఆమెను అడ్డుకున్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ బెంజ్ సర్కిల్ లో రోడ్లన్నీ బ్లాక్
చేసి సభలు నిర్వహించారు. అవన్నీ వదిలేస్తే ఈరోజు చంద్రబాబు ప్రతిపక్షనేతగా
గ్రౌండ్స్ లో సభలు పెడుతున్నారా. లేదే..ఎక్కడైతే ట్రాఫిక్ నిలిచి ఉంటుందో
అక్కడికి వెళ్లి మాట్లాడుతున్నారు. అదేమని ఎవరైనా అడిగితే నన్నే అడుగుతారా అని
చంద్రబాబు ప్రశ్నించడమే కాదు.తాను ఏదనుకుంటే అదే రూలని అంటున్నాడు. సరే
చంద్రబాబును వదిలేద్దాం. ఆయన ఆడించే ఆటబొమ్మైన పవన్ కల్యాణ్ ఇప్పడం గ్రామం
వద్ద వెహికల్ టాప్ పై ఎక్కి ప్రయాణించాడు. తమకు ఎలాంటి రూల్స్ ఉండవు అనుకునే
అరాచకపు బ్యాచ్ ఈరోజు వైయస్సార్ సిపి గురించి విమర్శించడం అనేది వారి వైఖరిని
తెలియచేస్తోంది తప్ప ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్
మాటల్లో చెప్పాలంటే ఎనీ డైరక్షన్ ఆర్ రిస్ర్టిక్షన్ లేదా బెనిఫిట్ అనేది
పార్టీలకతీతంగా ఉండాలనేది లక్ష్యం. అది ఎంతగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది మా
పార్టీ వారు తప్పుచేసినా కేసులు బుక్ చేయడంలోగాని,ఇృతర అంశాలలో పోలీసు
యంత్రాగం నిష్పాక్షపాతంగా పనిచేస్తున్నారనేది అందరికి తెలుసు. దానిపై టిడిపి,
పచ్చమీడియా బురద చల్లేందుకు దుష్ప్రచారం చేస్తున్నారనేది స్పష్టం అవుతుంది.
భూ సర్వేతో రెవెన్యూశాఖలో సిఎం వైయస్ జగన్ సంస్కరణలు చేస్తున్నారు. ఇది ఒక
బృహత్తర భాధ్యత. ఎప్పుడో జరిగి ఉండాల్సింది. దీనివల్ల ప్రజలకు ఎంత మేలు
జరుగుతుందనేది అందరూ చూస్తున్నారు. ఇంత పెద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు
చిన్నచిన్నవి ఉంటాయి. ప్రభుత్వం-ఎంప్లాయిస్ రెండు వేర్వేరు కాదు. అయితే
ఇంప్లిమెంట్ చేయడంలో వారికి ఉన్న ఇబ్బందులు,వత్తిడులు ఏవైనా ఉన్నా ఉద్యోగుల
నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుంది. వాటిని
పరిష్కరిస్తుంది. కాని వాటి పేరు చెప్పి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం
గురించి దుష్ప్రచారం చేయడం సరికాదు. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో రీ సర్వే
చేస్తూ సీఎం శ్రీ వైయస్ జగన్ రైతులకు మేలు చేస్తున్నారు. శ్రీ వైయస్ జగన్
గారికి ప్రజల్లోమంచి పేరు వస్తుందనే దుర్భుద్దితో వాళ్లు చేసే దుష్ప్రచారాన్ని
ఖండిస్తున్నాం. భూముల రీ సర్వే పై ప్రతిపక్షాలు విమర్శలు సరికావు.
వైయస్ జగన్ సైకోపాలన పోవాలి – సైకిల్ రావాలంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు
సరికాదు. ఎవరు సైకో అనేది చంద్రబాబు,ఆయన కొడుకు మాటలు చూస్తే అర్ధమవుతుంది.
పచ్చమీడియా చేస్తున్న వీరంగం చూస్తుంటే పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నట్లుందిగా
ఉంది. చంద్రబాబే సైకోగా తయారైనట్లు కనిపిస్తుంది. ప్రజలు కూడా అదే
భావిస్తున్నారు. రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ చంద్రబాబు చేసిన
విమర్శలపై మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ లోనే
చెప్పారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతులకోసం సున్నావడ్డి, పెట్టుబడి
రాయితీ సహా పలు పథకాలు ఇస్తున్నారు. రైతులకు ప్రభుత్వంనుంచి రావాల్సినవి అన్నీ
కూడా ప్రణాళికబద్దంగా వారికి అందచేస్తున్నారు. రైతులకు వారికి అవసరమైన
సమయానికి అవి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు సంవత్సరకాలంలో ఏదైనా
నష్టపోయి ఉంటే రైతుభరోసా రూపంలో వారికి పూర్తిగా వస్తుంది. ఇవన్నీ ఇంతగా
ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు
వస్తుంది. మరోవైపు చూస్తే కుటుంబానికి సంబంధించి అనేక సంక్షేమ పధకాలు కూడా
వారికి అందుతున్నాయి. ఆర్దికపరమైన ఇబ్బందులు గాని,ప్రభుత్వం తమను
పట్టించుకోవడం లేదనే దాంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్ధితులు రాష్ర్టంలో
గత మూడున్నరేళ్లలో లేవు. వారికి అందాల్సినవన్నీ కూడా ఎటువంటి లంచాలు
ఇవ్వకుండా వారి అకౌంట్లలోకి నేరుగా వస్తుంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు.
చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి. నోరుంది కదా ,తనకు పత్రికలు ఉన్నాయ కదా
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు.