అభివృద్ది పనులు ఎలా జరుగుతున్నాయని పరిశీలించాం
లోకేష్ నడిచినా ప్రయోజనం లేదు
అసలు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా
వారాహి కి టీడీపీ జండాలు కట్టాలి
మీ పార్టీలకు సిద్ధాంతం ఉందా?
ఒంటరిగా పోటీ చేసే దమ్ము వున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి
175 పేర్లు చెప్పే దమ్ము చంద్రబాబు,పవన్ కి వుందా : వెలంపల్లి
విజయవాడ : స్థానిక 50వ డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు
క్షేత్ర స్థాయిలో మంగళవారం మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు విసృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెలంపల్లి
మాట్లాడుతూ 50వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించడం జరిగిందన్నారు. అభివృద్ది
పనులు ఎలా జరుగుతున్నాయని పరిశీలించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారకానికి
కృషి చేస్తున్నామన్నారు.కొండా ప్రాంత సమస్యలు పరిష్కారానికి కృషి
చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కమ్యునిస్ట్ కార్పొరేటర్ వున్న అభివృద్ది
చేస్తున్నామన్నారు.అభివృద్ది మాది ఫోటో వాళ్ళదనీ ఎద్దేవా చేశారు. స్థానిక
కార్పొరేటర్ డివిజన్ సమస్యలపై ఎప్పుడు మాట్లాడడని అన్నారు. గతంలో చంద్రబాబు
ఎప్పుడు కుప్పం వెళ్ళేవాడు కాదు నేడు నెల కి మూడు రోజులు వెళ్తున్నాడన్నారు.
ఓటమి భయం పట్టుకుందన్నారు. లోకేష్ నడిచిన ప్రయోజనం లేదన్నారు. పులి ని చూసి
నక్క వాత మాదిరిగా లోకేష్ పరివర్తన వుందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ పోటీ
చేస్తాడా అని ప్రశ్నించారు. అర్హత లేదు అన్నావు..ఎందుకు యాత్రలు చేస్తున్నావో
ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వారాహి కి టీడీపీ జండాలు కట్టాలని సలహా ఇచ్చారు. బీజేపీని విమర్శించిన వ్యక్తి
ఈ రోజు ఎందుకు కాళ్ళు పట్టుకుంటున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మీ
పార్టీలకు సిద్ధాంతం ఉందా అని ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము వున్న
నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.175 పేర్లు చెప్పే దమ్ము చంద్రబాబు,
పవన్ కి ఉందా అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ బంక విజయ,
చాముండేశ్వరి,శివ,పితా మోహన్,సైకం సాయిబాబు, కామరాజ్ హరీష్ కుమార్, కోడి వెంకట
రమణ, ఎం వీరాస్వామి, జీ రాంప్రసాద్, కొక్కిలగడ్డ పార్వతి, రవుఫా, వివేకానంద,
లక్ష్మన్,హరి, సూర్య కళ, చెక్క శ్రీనివాసరావు, సతీష్, తదితర డివిజన్ నాయకులు,
కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, నగర పాలక
సంస్థ అధికారులు పాల్గొన్నారు.