కుప్పం : కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన పర్యటనపై పోలీసులు
ఆంక్షలు విధించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి
తీసుకోవాలని పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు
బుధవారం కుప్పంలో తలపెట్టిన పర్యటనపై పోలీసు ఆంక్షలు మొదలయ్యాయి. రోడ్లపై
సభలు, ర్యాలీలు, రోడ్‌షోల మీద ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల
ఆధారంగా చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాల్సిందిగా పలమనేరు పోలీసులు కుప్పం
టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. అనుమతి ఉన్న చోటే సభలు, కార్యక్రమాలు
నిర్వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు
సమాచారం ఇవ్వాలని కోరారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంక్షల
పేరుతో కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ
కార్యాచరణకు అనుగుణంగానే మందుకు వెళ్తామని చెబుతున్నారు. కుప్పం నియోజవర్గ
పరిధిలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. దీనికి సంబంధించి
షెడ్యూల్‌ను పార్టీ గత వారమే ఖరారు చేసింది.