గుంటూరు : విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని మాజీ మంత్రి
పేర్ని నాని దుయ్యబట్టారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర
కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని ఎద్దేవా
చేశారు. ఉచిత విద్యుత్‌పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. విద్యుత్
ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన ఘనుడు బాబు’’ అంటూ పేర్ని నాని
మండిపడ్డారు. ‘‘చంద్రబాబుది సుత్తి విజన్. చంద్రబాబు గతంలో చెప్పిన విజన్
2020 ఏమైంది?. ఆయన విజనరీ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయింది. ఒక్క ప్రాజెక్టు
పూర్తి చేసానని చెప్పుకునే దమ్ముందా?. చంద్రబాబు కుప్పానికి కనీసం నీళ్లు
ఇచ్చారా?. చంద్రబాబుది దిక్కుమాలిన విజన్. ప్రాజెక్టుల సందర్శన అంటూ
చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. ఆవగింజంత కూడా సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు.
ఎవరిని మోసం చేద్దామని ప్రాజెక్టులను సందర్శిస్తున్నావు. చంద్రబాబు తెచ్చిన
పథకం కనీసం ఒక్కటైనా ఉందా?. విజన్ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు విజన్ ఉందా?’’
అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. ‘‘విద్యారంగాన్ని ఒక్కసారైనా
పట్టించుకున్నావా?. కనీసం ఒక్క ప్రభుత్వ స్కూల్‌నైనా బాగుచేశావా?. కనీసం
నారావారిపల్లెలో ఒక్క ప్రభుత్వ స్కూల్‌నైనా అభివృద్ధి చేశావా బాగుచేయకపోగా
స్కూల్స్‌ను మూసేసిన ఘనుడు చంద్రబాబు. చదువుతో వ్యాపారం చేసే నారాయణకు
ప్రభుత్వ బడులు అప్పజెప్పావు. ఆరోగ్య రంగంపై చంద్రబాబుకు ఏం విజన్ ఉంది?.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల నుంచి డబ్బులు తీసుకున్న విజన్ చంద్రబాబుది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేశావు. 108 అంబులెన్స్,
ఆరోగ్యశ్రీ మహానేత వైఎస్సార్ విజన్. సీఎం జగన్ ఆరోగ్యశ్రీ కింద 3 వేలకుపైగా
జబ్బులు చేర్చారని పేర్ని నాని పేర్కొన్నారు.