సీఎం పదవి ఆశించలేదంట, ఇస్తే తీసుకుంటారంట
పవన్ సినిమాల్లో హిరో కావోచ్చు, కానీ రాజకీయాల్లో జీరో
రాజమహేంద్రవరం : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల
కృష్ణ మండిపడ్డారు. పవన్ పూటకో వేషం వేస్తున్నారని, చంద్రబాబు ఇచ్చిన
స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది
చనిపోతే పవన్ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. శనివారం మీడియాతో
మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ పవన్ స్థిరత్వం లేని వ్యక్తి అని
విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదంటారని, తర్వాత ఇస్తే
తీసుకుంటానంటారని మంత్రి ఎద్దేవా చేశారు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ
మాట్లాడలేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. చిరంజీవి కష్టపడి సంపాదించిన
ఇమేజ్ ఆయనకు లభించిందని అన్నారు. ‘‘నువ్వు చేసిన తప్పదాల గురించి నీ
మనస్సాక్షిని అడుగు. తప్పులు ఉంటే చెప్పాలి. కానీ చెప్పులు చూపించడం కాదు. నీ
కార్యకర్తల మనోభావాలపై బండరాయి వేస్తున్నావు’’ అని మంత్రి వేణుగోపాల కృష్ణ
అన్నారు. పిఠాపురంలో పవన్ మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా
పాటించాడా? అని ప్రశ్నించారు. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన పవన్ ఉన్నాడని..
అతను సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో జీరో అని ప్రజలకు అర్థమైందని
అన్నారు. గోదావరి జిల్లాలో అతని సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు పవన్
ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు,
అనేక పథకాలు ప్రభుత్వం అందిస్తోందని, ఇవేవీ పవన్ కి కనిపించడం లేదా? అని
మంత్రి వేణుగోపాల కృష్ణ నిలదీశారు. పవన్ చేస్తున్న ‘నారాహి’ యాత్రను ప్రజలు
పట్టించుకోరని విమర్శించారు. లోకేష్ ఫేయిల్యూర్ యాత్రని కప్పి పుచ్చుకునేందుకు
బాబు పవన్ ఈ యాత్ర చేపిస్తున్నట్లు ఎద్దేవా చేశారు.