నెల్లూరు : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ గా చరిత్రకి
ఎక్కిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ధ్వజమెత్తారు. వెంకటాచలం మండలంలోని చెముడు గుంట షిడ్స్ కళ్యాణ మండపంలో ఆయన
మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని బలవంతంగా లాక్కున్న
చంద్రబాబు నాయుడు కనీసం పార్టీని కూడా నడుపుకోవడం చేతకాదన్నారు. మోసం చేసి
బతకడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. నీతి, నిజాయితీ అనేది
చంద్రబాబులో ముచ్చుకైనా లేదన్నారు. తన కొడుకు లోకేష్ కు బాధ్యతలు
అప్పగించేందుకు నానా అవస్థలు పడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి
వెళ్ళిన అపశకునాలే ఎదురవుతున్నాయని నెల్లూరుకు వస్తే ఆరు మందిని చంపేశాడని,
విజయవాడలో చీరలు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టి ముగ్గురు మృత్యువాత పడ్డారని,
ఒంగోలు జిల్లాలో మరికొందరు మృతి చెందారని చంద్రబాబు నాయుడు ఎక్కడ పాదం పెట్టిన
అక్కడ బస్మాసురుడి లాగా మారాడన్నారు. నారా లోకేష్ పాదయాత్రలో ప్రముఖ సినీ
నటుడు తారకరత్న మృతి చెందాడన్నారు. ప్రజలతో పాటు దేవుడు కూడా చంద్రబాబు నాయుడు
పరిపాలన వద్దని కోరుకుంటున్నారని తేటతెల్ల మవుతుందన్నారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి జన రంజకమైన పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ
పథకాలను గృహ సారధుల ద్వారా ప్రతి ఇంటికి చేరేలా ప్రచార బాధ్యతలు
అప్పగిస్తున్నామన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా
గృహ సారధులకు సూచనలు అందిస్తున్నామన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణ
మండపంలో నిర్వహించిన “మా నమ్మకం.. నువ్వే జగన్” కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ,
సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
పాల్గొన్నారు. గృహ సారథులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి గడపకు
వెళ్లాలి..గత ప్రభుత్వంలో ఏం చేసింది.. మన ప్రభుత్వంలో ఏం చేస్తున్నామనే
తేడాను ప్రజలకు వివరించి, వారి మద్దతు కోరాలని మంత్రి కాకాణి సూచించారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ
సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి వివరించారు. “మా నమ్మకం… నువ్వే
జగన్” కార్యక్రమంలో భాగంగా నూతనంగా తయారుచేసిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ
చేయాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును
ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి
మద్దతుగా ఉన్నారని ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి
కార్యక్రమాలతో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని
ప్రకటించారు.