-టిడిపి హయాంలో గంజాయిపై అప్పటి మంత్రులే కలత చెందారు….
-రైతుల జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు…. నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ
వోలకపోస్తున్నాడు…
గుడివాడ : ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా తయారైన చంద్రబాబు ఏం
మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని
రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ
స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే
రోజా మీడియాతో మాట్లాడారు.టిడిపి హయాంలో అప్పటి మంత్రులే గంజాయి సాగుపై
బహిరంగంగా మాట్లాడారని,నాటి విషయాలను మరిచిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై
బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మంత్రి రోజా విమర్శించారు.
సెబ్ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్రంలో గంజాయి పై ఉక్కు పాదం మోపామని మంత్రి
రోజా చెప్పారు.వ్యవసాయం దండగ అని రైతుల జీవితాలను నాశనం చేసి,కాల్పులు జరిపిన
చంద్రబాబు,నేడు రైతులపై కల్లా బొల్లి ప్రేమ వలకబోయడం హాస్యాస్పదమని, టిడిపి
హయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని మంత్రి రోజా
ప్రశ్నించారు. కుంభకోణాల కర్ణుడు చంద్రబాబు చెప్పే మాయ మాటలను నమ్మే
పరిస్థితిలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ లేరని మంత్రి రోజా అన్నారు.