గుంటూరు : తమ స్వార్ధ ప్రయోజనాల కోసం గత తెలుగుదేశం పాలకులు నిర్లక్ష్యం చేసి,
మూసివేసిన వాటిని తిరిగి ప్రాణం పోసి సీఎం జగన్ పునరుద్ధరిస్తున్నారని
రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా బుధవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు.
ప్రజలకు ఆరోగ్య పరంగా, ఆర్దిక పరంగా ఎంతగానో ప్రయోజనం చేకూర్చే 108 అంబులెన్స్
లు, చిత్తూరు డెయిరీని చంద్రబాబు మూసివేస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి తిరిగి
పునరుద్ధరించారని అన్నారు. కొంతమంది రైతు వ్యతిరేకులు 2003లో టీడీపీ హయాంలో
హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ యాజమాన్యానికి లబ్ది చేకూర్చేందుకు మూసివేసిన
చిత్తూరు డెయిరీ పరిశ్రమను పునరుద్ధరించడం వల్ల ప్రయోజనం ఏమిటని అవగాహన లేమితో
అడుగుతున్నారని అన్నారు. అక్కడ అమూల్ సంస్థ 380 కోట్లు పెట్టుబడితో
భారతదేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని తద్వారా
5,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 2 లక్షల మందికి పరోక్ష ఉపాధి, 25 లక్షల
మంది పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ఆదాయం అందుతుందని అన్నారు. దీంతో చిత్తూరులో
పాడిపరిశ్రమ తిరిగి పుంజుకుంటుందని అన్నారు.

నేనున్నానని బాధితులకు సీఎం జగన్ భరోసా : చిత్తూరు జిల్లా తిరుగు ప్రయాణంలో
సమస్యలు చెప్పుకున్న బాధితులకు సత్వరమే ప్రభుత్వం తరపున సాయం చేయాలని సీఎం
జగన్ అధికారులకు ఆదేశించారని అన్నారు. కష్టాలు చెప్పుకున్న బాధితులకు తక్షణ
వైద్య, ఆర్ధిక సాయం అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారని
విజయసాయిరెడ్డి తెలిపారు.