14 ఏళ్ళ పాలనలో 8 లక్షల కోట్లు దోచుకున్నాడు
అధికార దాహ పిశాచి చంద్రబాబు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
వెలగపూడి : చంద్రబాబు రహిత రాజకీయాలతోనే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
జనరంజక జగన్ పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని, ప్రతి ఇంట్లో ప్రతి నెల
సిరుల పంట పండుతుందని, లక్ష్మీదేవి తలుపు తడుతుందని అన్నారు. వారికి జరిగే
మేలుని అడ్డుకోవడమే దుర్మార్గుడు చంద్రబాబు అంతిమ లక్ష్యమన్నారు. అధికారంలోకి
రావడం కోసం, వచ్చిన తరువాత దానిని నిలబెట్టుకోవడం కోసం, ఆపై రాష్ట్రాన్ని
దోచుకోవడం కోసం చంద్రబాబు 40 ఏళ్ళు పని చేసాడని అన్నారు. రాష్ట్రంలో
జరుగుతున్న సంక్షేమ పరిపాలన, రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి మీద
రోజు రోజుకీ ప్రజల్లో వెల్లువెత్తుతున్న అభిమానాన్ని చూసి ఓర్వలేక ఆయనపై ,
ప్రభుత్వంపై బురద చల్లేందుకు అనేక కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు.
సచివాలయం లోని పబ్లిసిటీ సెల్లో మంగళవారం మీడియాతో ఆయన మాటాడారు. చంద్రబాబును
పచ్చ మీడియా ఆకాశానికి ఎత్తేస్తే సీఎం జగన్ పాతాళానికి తీసుకొచ్చాడని
అన్నారు. మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపంలో అధికారానికి
దూరమైపోయిన చంద్రబాబు , ఇంక తాను అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదేమో
అనుకున్న పరిస్థితుల్లో గతంలో అనేక తప్పులు చేశాను. నేను చేసిన తప్పులు
తెలుసుకున్నాను ఒక అవకాశం ఇస్తే తప్పులు సరిచేసుకుని మారిన మనిషిగా ప్రూవ్
చేసుకుంటానంటే 2019లో ఓటేస్తే ఐదేళ్లు రాష్ట్ర ప్రజల్నిదోచుకున్నాడని
అన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు అక్రమ పరిపాలనకి
అడ్డుపడడం జరిగిందన్నారు. దీంతో ఏదో రకంగా అధికారంలోకి వచ్చేం దుకు ప్రజల
మనసుల్ని విష తుల్యం చేయడానికి, జన జీవనాన్ని చిన్నాభిన్నం చేయటం కోసం
అరాచకాలను సృష్టిస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ని
చంపేసి ఆయన ఫొటోకు దండేసి మొసలి కన్నీరు కార్చటం, కుల విద్వేషాలను
రెచ్చగొట్టటం, ఆనక తీరుబడిగా ఆయా కుటుంబాలను పరామర్చించడం చంద్రబాబుకు
పారిపాటైందన్నారు. అదంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి ఆపాదిస్తూ రాజకీయ
లబ్ధి పొందడం కోసమే పచ్చ మీడియాను ప్రయోగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వంటి
మోసగాడి మాటలు నమ్మొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలకు జరిగే మేళ్లు
పవన్ కళ్యాణ్ కానీ, పచ్చ మీడియా కానీ ఏదో రకంగా అడ్డుకోవడమే వారి
ధ్యేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు
డీబీటీ ద్వారా కోటి 20 లక్షలు కుటుంబాలకి నేరుగా లబ్ది చేకూరిస్తే వారికి
కంటగింపుగా ఉందన్నారు. అతను పరిపాలించినప్పుడు కానీ, ఇప్పుడు జరుగుతున్న
పరిపాలన లో గాని బడ్జెట్ పరంగా పెద్ద తేడా ఏముందన్నారు . చంద్రబాబు దగా
చేసినట్లుగా జనం అర్థం చేసుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు
గుండెల్లోకి వెళ్లిపోయారని, ఏ రకంగా దీన్ని ప్రజలకు దూరం చేయాలి ప్రజలు మనసులో
ఏదో రకంగా విషo నింపాలి, ఎప్పుడు అధికారంలోకి వస్తామా అన్న ఆలోచన
చంద్రబాబుదన్నారు. చంద్రబాబు చెప్పమన్న మాటలు మనం చెప్పాలంటే ముందు మనకు
అర్థం అవ్వాలన్న కనీస ఆలోచన కూడా చేయని పవన్ కళ్యాణ్ ప్రజల్లో చులకన
అవుతుంటే సాటి కులస్తుడిగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా
బాధాకరంగా ఉందన్నారు. చంద్రబాబు అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడమేనన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష సరిచేసుకోవాలని సూచించారు. చంద్రబాబును
నమ్ముకోవటం ఏంటో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు వంటి క్షుద్రనాయకుల
ఆలోచనలకు పవన్ కళ్యాణ్ వంటి పిచ్చి నాయకులు అనేకమంది బలై పోతున్నరేమోని
ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబును అధికార దాహ పిశాచిగా అభివర్ణించారు.