విజయవాడ : ప్రచార యావతో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ ని ఉపయోగిస్తున్నారని,
అందువలన కొంతమంది అమాయకు ప్రజలు చనిపోవడం బాధాకరమని సీనియర్ రాజకీయ నాయకులు
ఆకుల శ్రీనివాస్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీ అధికారం
లోకి వచ్చిన వెంటనే అవ్వా తాత లకు, వితంతువు లైన అక్కా చెల్లెమ్మ లకు
ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల పెన్షన్ ను దశల వారీగా 3వేల రూపాయల వరకు
పెంచుతా నని ఇచ్చిన మాట ప్రకారం రూ 2750 రూపాయలు ఈ జనవరి 1వతేది నుండి
ఇస్తున్న ముఖ్యమంత్రి జగనన్నను ప్రజలు గుండెల్లో పెట్టు కుంటున్నారని
పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్ర బాబు చేసిన చౌకబారు రాజకీయం
గుంటూరులో బయట పడిందన్నారు. సంక్రాంతి పండుగకు ఇంకా పది రోజుల సమయం
ఉన్నప్పటికీ ఆ రోజే చంద్రన్న పండుగ కానుక ఎందుకు పెట్టవలసి వచ్చిందనీ ఆకుల
శ్రీనివాస్ ప్రశ్నించారు. కందుకూరు సంఘటనను దృష్టిలో పెట్టుకొని అటువంటివి
పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనుకుంటే, చంద్రబాబుకు నిజంగా పేదవాళ్ళ మీద
ప్రేమ ఉంటే వాళ్ళకి ఇంటింటికీ వెళ్ళి టోకే న్లు పంచినట్లు ఈ సరుకులు
పంచొచ్చుగా? అని ప్రశ్నించారు. చంద్ర బాబుకు 23 సంఖ్య ఈసారి నూతనసంవత్సర
రూపంలో వచ్చిందనీ, అమాయక ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేని తనాన్ని బయటపెట్టిందని
ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చౌకబారు రాజకీయ ఎత్తుగడలను ఇకపై ప్రజలు
నమ్మబోరని ఆకుల శ్రీనివాస్ స్పష్టం చేశారు.