తిరుపతి జిల్లా
సూళ్లూరుపేట చంద్రయాన్-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్
ధవన్ స్పేస్ సెంటర్ (షార్) సిద్ధమైంది..
ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు
కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక
నుంచి ఎల్వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్కు చేరుకున్న
ఇస్రో అధిపతి డా.సోమనాథ్.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి
భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్-3 ఉపగ్రహ
ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్, ఎల్వీఎం-3పీ4 మిషన్ డైరెక్టర్
ఎస్.మోహన్‌కుమార్, అసోసియేట్ మిషన్ డైరెక్టర్ నారాయణన్, వెహికల్
డైరెక్టర్ బిజూస్ థామస్ ఉన్నారు.