సైదాపురం, వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్13: మండలం లోని ఆదూరుపల్లి,పొక్కదల గ్రామాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నమోదు మహిళ కోసం ఏర్పాటు చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కురుగొండ్ల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. నేను ఎమ్మెల్యే గా మండలం లో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజా సేవలో ఉన్నాన్నారు. మరో సారి ఎమ్మెల్యే గా గెలిపిస్తే ప్రజల రుణం తీర్చు కుంటామన్నారు. కార్యక్రమంలో వెంకట గిరి నియోజకవర్గ పరిశీలకుడు జెన్నీ రమణయ్య, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ రైతు ఉపాధ్యక్షుడు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మస్తాన్ నాయుడు. పాములూరు శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.