బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్, సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ వన్డే
క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టాడు. దాంతో
బంగ్లాదేశ్ తరపున 300 వన్డే వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లో
నిలిచాడు. చట్టోగ్రామ్ వేదికగా సోమవారం ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో
రెహాన్ అహ్మద్ వికెట్ పడగొట్టడం ద్వారా షకీబ్ ఈ ఘనత అందుకున్నాడు. వన్డే
క్రికెట్లో 300 వికెట్స్ పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్గా.. ఓవరాల్గా
14వ బౌలర్గా షకీబ్ రికార్డుల్లోకెక్కాడు.బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan 300
Wickets)కు ముందు ఇద్దరు మాత్రమే 200 వన్డే వికెట్ల మైలురాయిని అధిగమించారు.
వెటరన్ పేసర్ ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టగా..
అబ్దుర్ రజాక్ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ 227 వన్డేల్లో
300 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వన్డే వికెట్లు
పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్
అగ్రస్థానంలో ఉన్నాడు. ముత్తయ్య లఖాతాలో 534 వన్డే వికెట్స్ ఉన్నాయి. వసీం
అక్రమ్ (502), వకార్ యూనిస్ (416), చమిందా వాస్ (400), షాహిద్ అఫ్రిది
(395) టాప్ 5లో ఉన్నారు.